ఐపీఎల్‌లోనూ ధోని మార్క్.. చెన్నై ఏకఛత్రాధిపత్యం..
ఐపీఎల్‌లోనూ ధోని తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన మహేంద్రుడు 2010, 2011, 2018లో మూడుసార్లు టైటిల్స్ అందించాడు.
Dhoni Mark In IPL: ఐపీఎల్‌లోనూ ధోని తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన మహేంద్రుడు 2010, 2011, 2018లో మూడుసార్లు టైటిల్స్ అందించాడు. వికెట్ల వెనుక అతడు రచించే పక్కా వ్యూహాలు, చివరివరకు మ్యాచ్‌ను తీసుకెళ్లడం.. ఫినిషింగ్ స్టైల్ అన్నీ కూడా వావ్ అని చెప్పాలి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నైను మొత్తం 10 సార్లు ప్లే ఆఫ్స్‌కు, ఎనిమిది సార్లు ఫైనల్‌కు తీసుకెళ్ళాడు. అలాగే 2010, 2014 ఛాంపియన్స్ లీగ్‌లో చెన్నైని గెలిపించాడు. మధ్యలో ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై టీం రెండేళ్లు సస్పెన్షన్ కు గురికావడంతో ధోని అప్పుడు పూణే వారియర్స్ తరపున స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆడాడు. కాగా, ఐపీఎల్ లో 190 మ్యాచులు ఆడిన ధోని 4432 పరుగులు చేశాడు.
Also Read: దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?