అమకతాడు టోల్ ఫ్లాజా వద్ద పోలీసుల తనిఖీలు.. అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల వెండి స్వాధీనం
టోల్ ఫ్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కారులో భారీగా వెండి పట్టుబడింది. రాయ్‌పూర్ నుంచి సేలంకు అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టోల్ ఫ్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కారులో భారీగా వెండి పట్టుబడింది. రాయ్‌పూర్ నుంచి సేలంకు అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు వ్యక్తులు KA 24M 3751 నెంబర్ గల కారులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ నుంచి తమిళనాడులోని సేలం వెళుతుండగా టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 400 నుంచి 500 కిలోల వెండి స్వాధీనపర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ లావాదేవీలకు సంబంధించి వారి వద్ద కొన్ని బిల్లులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. మిగిలినవాటికి ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెండిని, కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.