ఆ బ్యూటీ కోరికను నెరవేర్చిన స్టార్ హీరో..!

ఆ బ్యూటీ కోరికను నెరవేర్చిన స్టార్ హీరో..!

కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న నటుడు ధనుష్. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

Ravi Kiran

|

Aug 02, 2020 | 3:57 PM

Dhanush Fulfils Malavika Mohanan Dream: కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న నటుడు ధనుష్. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. త్వరలోనే సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేయనున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ ధనుష్‌కు 43వ చిత్రం కావడం విశేషం.

ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ ఎంపికైనట్లు సమాచారం. ఇటీవల ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మాళవిక శుభాకాంక్షలు చెప్పింది. అంతేకాకుండా ధనుష్‌తో కలిసి నటించాలని ఉన్నట్లు ఆమె మనసులోని కోరికను బయటపెట్టింది. దీనికి ధనుష్ వెంటనే ”ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుందని” రిప్లై ఇచ్చాడు. D43 సినిమాలో హీరోయిన్‌గా మాళవికను తీసుకుంటున్నట్లు ప్రొడ్యూసర్ టిజి త్యాగరాజన్ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నాడు. చూడాలి ఈ D43 సెట్స్‌పైకి వెళ్లనుందో.!

Beyond The Clouds Actor Malavika Mohanan Flaunts Her Sexy Curves in White-Gold Saree

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu