అందుకే నన్ను తొలగించారు.. మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ కామెంటేటర్లలో సంజయ్ మంజ్రేకర్ స్థానం చాలా ప్రత్యేకమైంది. ఆయన కామెంటరీకి ఎందరో అభిమానులు ఉన్నారు.

  • Ravi Kiran
  • Publish Date - 4:00 pm, Sun, 2 August 20
అందుకే నన్ను తొలగించారు.. మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

Sanjay Manjrekar Comments On BCCI: భారత క్రికెట్ కామెంటేటర్లలో సంజయ్ మంజ్రేకర్ స్థానం చాలా ప్రత్యేకమైంది. ఆయన కామెంటరీకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ముంబై ఆటగాళ్లపై అతి ప్రేమ చూపిస్తాడని.. మిగిలిన ప్లేయర్స్‌ను కించపరుస్తాదంటూ మంజ్రేకర్‌పై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయన బీసీసీఐ కామెంటరీ ప్యానల్‌లో చోటు కోల్పోయాడు. ఈ నేపధ్యంలో సంజయ్ మంజ్రేకర్ తాజాగా తనపై వేటు ఎందుకు పడిందన్న దానిపై మీడియాకు తెలిపాడు.

”తన కెరీర్‌లో ఇప్పటివరకు తాను ఎవరిని కావాలని కించపరచలేదన్న సంజయ్.. కొందరు ఆటగాళ్లకు తాను నచ్చకపోవడం వల్లనే తనను కామెంటరీ ప్యానల్‌ నుంచి తప్పించారని.. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి ఫోన్ చేసి చెప్పాడని వివరించాడు. కాగా, త్వరలోనే ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపధ్యంలో తనను మళ్లీ కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాల్సిందిగా మంజ్రేకర్ బీసీసీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో బోర్డు మార్గదర్శకాలు వ్యవరించడంలో పొరపాటు జరగిందని.. అయితే ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటానని వివరిస్తూ మంజ్రేకర్ లేఖలో పేర్కొన్నాడు.