మహారాష్ట్రలో బీజేపీకి షాక్ ! సీనియర్ నేత ఏక్ నాథ్ రాజీనామా
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి సుమారు 35 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చిన సీనియర్ నేత ఏక్ నాథ్ ఖాడ్సే బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరనున్నారు. 2016 లో నాడు బీజేపీ నేత, అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయించారు. అందుకే …ఇప్పుడు ఫడ్నవీస్ తన జీవితాన్ని నాశనం చేశారని ఏకనాథ్ ఆరోపించారు. ఇక గత […]
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి సుమారు 35 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చిన సీనియర్ నేత ఏక్ నాథ్ ఖాడ్సే బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరనున్నారు. 2016 లో నాడు బీజేపీ నేత, అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయించారు. అందుకే …ఇప్పుడు ఫడ్నవీస్ తన జీవితాన్ని నాశనం చేశారని ఏకనాథ్ ఆరోపించారు. ఇక గత ఏడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఈయనకు బీజేపీ టికెట్ లభించకపోగా ఈయన కూతురు రోహిణి ఖడ్సే కి టికెట్ లభించింది. కానీ ఆమె ఓడిపోయారు. కాగా ఏక్ నాథ్ శుక్రవారం తమ పార్టీలో చేరుతారని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు.