బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా.. జై షా స్థానంలో వచ్చిన సైకియా ఎవరు?

జనవరి 12న భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కార్యదర్శిని ఎన్నికుంది. BCCIప్రత్యేక సాధారణ సమావేశంలో కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు. జై షా స్థానంలో ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. ఆయనతో పాటు ప్రభతేజ్ సింగ్ భాటియా కొత్త కోశాధికారిగా నియమితులయ్యారు.

బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా.. జై షా స్థానంలో వచ్చిన సైకియా ఎవరు?
Devajit Saikia
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2025 | 5:10 PM

జై షా ఐసిసి అధ్యక్షుడైన తర్వాత బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. అయితే ఇప్పుడు ఈ పదవిని భర్తీ చేశారు. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియాను నియమించింది. BCCI ఇటీవల ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దేవ్‌జిత్ సైకియా కొత్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ప్రభతేజ్ సింగ్ భాటియా కొత్త కోశాధికారిగా నియమితులయ్యారు.

జనవరి 12న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రత్యేక సాధారణ సమావేశంలో కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు. జై షా స్థానంలో ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. డిసెంబరు 1న ఐసిసి ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి సైకియా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతను పొందారు. కాగా, ఆశిష్ షెలార్ స్థానంలో కోశాధికారి పదవిని ప్రభతేజ్ సింగ్ భాటియా స్వీకరించారు.

అసోంకు చెందిన దేవ్‌జిత్ సైకియా క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం ఉండకపోయినా, ఆట పట్ల అతని అభిరుచి, ఆసక్తి ఈ సమయంలో అతనికి ఈ పెద్ద బాధ్యత దక్కింది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా, అతను 1990 – 1991 మధ్య నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆడారు. అతను 8.83 సగటుతో 53 పరుగులు చేశారు. అతని అత్యధిక స్కోరు 54, ఈ సమయంలో అతను ఎనిమిది క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ సాధించారు.

55 ఏళ్ల దావ్‌జిత్ సైకియా వృత్తిరీత్యా న్యాయవాది. పరిపాలనా అనుభవం కూడా కలిగి ఉన్నారు. సైకియా ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని క్రికెట్ క్లబ్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సైకియా, బిస్వా శర్మతో కలిసి అస్సాం స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో పనిచేశారు. 2016లో, సైకియా ACA వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2019లో ACA కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2022లో బీసీసీఐలోకి ప్రవేశించి జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.

హిమంత బిస్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, దేవ్‌జిత్ సైకియాను అస్సాం అడ్వకేట్ జనరల్‌గా, ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుగా నియమించారు. 21 మే 2021న, అతను అస్సాం అడ్వకేట్ జనరల్ అయ్యారు. డిసెంబర్ 2024లో ఐసిసి ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైకియా బీసీసీఐ కార్యదర్శిగా తాత్కాలికంగా వ్యవహరిస్తున్నారు. దీని తర్వాత, కార్యదర్శి పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించి, జనవరి 12న అధికారికంగా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..