AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi violence : ఐబి ఆఫీసర్ అంకిత్‌ శర్మ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..

ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఐబి ఆఫీసర్‌ అంకిత్‌ శర్మ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒళ్లు జలదరించే భయంకర నిజాలు బయటికొస్తున్నాయి. అంకిత్‌ డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లే ఆ దారుణకాండను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఇంత క్రూరంగా ఓ వ్యక్తిని హతమార్చడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారని అంటున్నారు.

Delhi violence : ఐబి ఆఫీసర్ అంకిత్‌ శర్మ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..
Ram Naramaneni
|

Updated on: Feb 29, 2020 | 2:07 PM

Share

Delhi violence :  ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఐబి ఆఫీసర్‌ అంకిత్‌ శర్మ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒళ్లు జలదరించే భయంకర నిజాలు బయటికొస్తున్నాయి. అంకిత్‌ డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లే ఆ దారుణకాండను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఇంత క్రూరంగా ఓ వ్యక్తిని హతమార్చడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారని అంటున్నారు. శరీరంలోని అన్ని భాగాలను పొడుస్తూ చంపడాన్ని ఇంతవరకూ చూడలేదని అంటున్నారు.

అంకిత్‌ శరీరంలో ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 4 వందల కత్తిపోట్లు ఉన్నాయి. పదునైన ఆయుధంతో శరీరాన్ని ఛిద్రం చేశారని..పలుమార్లు కిరాతకంగా పొడవడంతో మృతి చెందారని అటాప్సీ నివేదికలో పేర్కొన్నారు. ఐబిలో 2017 నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంకిత్‌ శర్మ..ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళుతుండగా చాంద్‌బాగ్‌లో అల్లరిమూకలు ఆయనను పాశవికంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని డ్రైనేజ్‌లో పడేశారు. అంకిత్‌ను 400 సార్లు పొడిచారని పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా, ప్రతి భాగాన్ని ఛిద్రం చేశారు. పేగులు బయటకు లాగారు. సుమారు 4 నుంచి 6 గంటల సేపు ఈ దారుణకాండ కొనసాగి ఉంటుందని..కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ హత్యాకాండలో పాల్గొని ఉంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారని వెల్లడించారు.

ఐబి అధికారి అంకిత్​ హత్య వెనక ఆప్‌ నాయకుడు తాహీర్​ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అంకిత్‌ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తాహీర్​పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంకిత్‌ను హత్య చేశారన్న ఆరోపణలతో తాహీర్ హుస్సేన్​ను పార్టీ నుంచి సస్పెండ్​ చేసినట్లు ప్రకటించింది ఆప్​.