షాకింగ్: జూన్ నెలాఖరుకు ఢిల్లీలో లక్ష కరోనా కేసులు.. నిపుణుల హెచ్చరిక..!

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశ రాజధానిలో విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. తాజాగా గడచిన 24గంటల్లో కొత్తగా

షాకింగ్: జూన్ నెలాఖరుకు ఢిల్లీలో లక్ష కరోనా కేసులు.. నిపుణుల హెచ్చరిక..!
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 1:25 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశ రాజధానిలో విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. తాజాగా గడచిన 24గంటల్లో కొత్తగా 1320 పాజిటివ్‌ కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,654కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 761మంది మృత్యువాతపడ్డారు. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.

కాగా.. ఈ కేసుల సంఖ్య జూన్‌ చివరినాటికి లక్ష దాటే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేసింది. రేపటి నుంచి ఢిల్లీలో అన్ని మాల్స్, రెస్టారెంట్స్ తెరుచుకుంటున్నాయి. ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా సోకినవారిలో 60 నుంచి 70 శాతం మంది ఢిల్లీ వాసులు కాదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్న ఆస్పత్రులు కేవలం ఢిల్లీ వాసులకోసమేనని.. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అందరికోసమని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ నెల చివరివరకు 15 వేల బెడ్స్ అవసరం ఉంటుందని ఒక అంచనా.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..