ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాక్..!

ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఏపీ వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు వారం రోజుల్లోగా పిటీషన్ కు జవాబు ఇవ్వాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం వైసీపీ నేత సుబ్బారెడ్డి.. తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై చర్య తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ […]

ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాక్..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:47 PM

ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఏపీ వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు వారం రోజుల్లోగా పిటీషన్ కు జవాబు ఇవ్వాలని ఆదేశించింది.

కొద్దిరోజుల క్రితం వైసీపీ నేత సుబ్బారెడ్డి.. తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై చర్య తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును ఏపీ ప్రభుత్వానికి పంపామని కేంద్రం తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు కోర్టు వాయిదా వేసింది