
Student Suicide in Adilabad District: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌లో జరిగింది. హర్కాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ శ్రీదేవి (21) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. తన సోదరి మృతికి తన భార్య, అత్త వేధింపులే కారణమని మృతురాలి అన్న ఇంద్రవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పలు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంద్రవెల్లి పోలీసులు పేర్కొన్నారు. అయితే.. అత్య, భార్య వేధింపుల కారణంగానే యువతి ఆత్మహత్యకు పాల్పడిందా… లేదా మరేదైనా కారణం ఉందా.? అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
Also read: