దీపికా పడుకొనే ‘చపాక్‌’ మూవీ రివ్యూ

సినిమా: చపాక్‌ దర్శకత్వం: మేఘనా గుల్జార్‌ నిర్మాణం: ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, దీపికా పదుకోన్‌, గోవింద సింగ్‌ సాందు, మేఘనా గుల్జార్‌ రచన: అతికా చౌహాన్‌, మేఘనా గుల్జార్‌ నటీనటులు: దీపికా పడుకోన్‌, విక్రాంత్‌ మాసే, విశాల్‌ దహియా, అంకిత్‌ బిష్ట్ తదితరులు సంగీతం: శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌ కెమెరా: మలాయ్‌ ప్రకాష్‌ ఎడిటింగ్‌: నితిన్‌ విడుదల: జనవరి 10, 2020 సొసైటీలో సెలబ్రిటీలు అడ్రస్‌ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో […]

దీపికా పడుకొనే 'చపాక్‌' మూవీ రివ్యూ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 10, 2020 | 4:40 PM

సినిమా: చపాక్‌ దర్శకత్వం: మేఘనా గుల్జార్‌ నిర్మాణం: ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, దీపికా పదుకోన్‌, గోవింద సింగ్‌ సాందు, మేఘనా గుల్జార్‌ రచన: అతికా చౌహాన్‌, మేఘనా గుల్జార్‌ నటీనటులు: దీపికా పడుకోన్‌, విక్రాంత్‌ మాసే, విశాల్‌ దహియా, అంకిత్‌ బిష్ట్ తదితరులు సంగీతం: శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌ కెమెరా: మలాయ్‌ ప్రకాష్‌ ఎడిటింగ్‌: నితిన్‌ విడుదల: జనవరి 10, 2020

సొసైటీలో సెలబ్రిటీలు అడ్రస్‌ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో ప్రథమ వరుసలో ఉండేవి స్త్రీలపై జరిగే అకృత్యాలు. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం కూడా సమాజానికి చెప్పాల్సిందే. ఆ పనికి నడుంకట్టారు మేఘనా గుల్జార్‌. యాసిడ్‌ బాధితురాలిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించడానికి సై అన్నారు దీపికా. ఈ సినిమాకు ఆమె ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద సంక్రాంతి జోరు మొదలైన తరుణంలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? ఏం చెప్పింది? ఎలా చూపింది? చదివేద్దాం

కథ: మాలతి (దీపికా పదుకోన్) స్కూల్లో చదువుకునే అమ్మాయి. అప్పుడప్పుడే అబ్బాయిలతో పరిచయాలు పెరిగే పరువంలోకి అడుగుపెడుతుంది. అప్పటిదాకా కలిసి మెలిసి తిరిగిన వారు కూడా ఆమెను కొత్తగా చూడటం మొదలుపెడతారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ బబ్బూ (విశాల్‌ దహియా) ఓ సందర్భంలో తనను ‘అన్నా’ అని పిలవొద్దని అంటాడు. అంతే కాదు… ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడతాడు. దానికి ఆమె ఒప్పుకోదు. పైగా అతని ఫోన్లకు స్పందించడం మానేస్తుంది. దానికి తోడు తనకు నచ్చిన రాజేష్‌ (అంకిత్‌ బిష్ట్ )తో సన్నిహితంగా ఉంటుంది. అది నచ్చని బబ్బూ ఒకసారి ఆమెను మందలిస్తాడు. కానీ ఆమె బెదరదు. దాంతో తన వదిన సాయంతో మాలతిపై యాసిడ్‌ అటాక్‌ చేస్తాడు. మాలతి ముఖం పూర్తిగా కాలిపోతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఇచ్చిన భరోసాతో ఆమె ఓ సోషల్‌ యాక్టివిస్ట్ గా మారుతుంది. ఆ క్రమంలోనే అమోల్‌ (విక్రమంత్‌ మాసే)తో అనుబంధం పెరుగుతుంది. అతని పట్ల ఆమెకు ఒన్‌సైడ్‌ లవ్‌ మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆమెపై దాడి చేసిన బబ్బూకి శిక్ష పడిందా? అతని వదిన ఎందుకలా చేసింది? అమోల్‌ మనసు మాలతి ప్రేమను గ్రహించిందా? వారిద్దరి జీవితాలు ఎలా మారాయి? వంటివన్నీ ఆసక్తికరం.

సమీక్ష: యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. యాసిడ్‌ బాధితురాలిగా దీపిక పడుకోన్ చాలా బాగా నటించారు. స్కూల్‌ స్టూడెంట్‌గా, అప్పుడప్పుడే ప్రేమలో పడిన అమ్మాయిగా మెప్పించారు. కాలిన గాయాలతో కనిపించే మేకప్‌ కూడా చాలా బాగా సూట్‌ అయింది. డీ గ్లామరైజ్డ్ రోల్‌లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు తప్పక నచ్చితీరుతుంది. సన్నివేశాలను కూడా చాలా నేచురల్‌గా రాసుకున్నారు. మేఘన ఈ స్క్రిప్ట్ ను డీల్‌ చేసిన విధానం బావుంది. మరీ ముఖ్యంగా 19 ఏళ్ల అమ్మాయి ఫీలింగ్స్ కి ముఖం, అందం వంటివన్నీ అడ్డు కావని చిన్న చిన్న డైలాగులతో బాగా చెప్పారు. ‘నా అంతట నేను ప్రేమించుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి’ అంటూ అమోల్‌ని మాలతి ప్రశ్నించే తీరు బావుంటుంది. దీపిక పడుకోన్‌ లిప్‌ లాక్‌ చేసిన సన్నివేశం క్లైమాక్స్ లో ఎమోషన్‌ని పండించింది. ఎంత కలిసిమెలిసి తిరిగిన వారినైనా ఓ కంట కనిపెడుతూ ఉండాలని, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని సమాజానికి ఓ సూచన ఇవ్వడానికి ఈ సినిమా పెద్ద ఉదాహరణ. సందర్భోచితంగా వచ్చే పాటలు, అందులో సాహిత్యం కూడా ఆకట్టుకుంటాయి. ఆత్మవిశ్వాసం ముందు అందం చిన్నబోతుందని చెప్పకనే చెప్పిన సబ్జెక్ట్. ఎప్పుడూ ఫ్లాష్‌ లైట్ల మధ్య అందంగా కనిపించే నటీనటులు అప్పుడప్పుడూ సమాజంలో జరిగే ఇలాంటి అంశాలను అడ్రస్‌ చేయడం వల్ల ఒకరకంగా అవగాహన కల్పించిన వారవుతారన్నది వాస్తవం.

ఫైనల్‌గా… చపాక్‌.. అడ్రస్‌ చేయాల్సిన అంశం!

డా. చల్లా భాగ్యలక్ష్మి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..