తిరుపతిపై అధినేతదే తుది నిర్ణయం.. సీనియర్లతో జగన్ మంతనాలు.. చివరికి తేలింది ఇదే!

|

Nov 19, 2020 | 7:04 PM

తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై దృష్టి సారించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా సీనియర్లతో భేటీ అయ్యారు. అయితే.. తుది నిర్ణయాన్ని..

తిరుపతిపై అధినేతదే తుది నిర్ణయం.. సీనియర్లతో జగన్ మంతనాలు.. చివరికి తేలింది ఇదే!
Follow us on

Decision left on Party chief: తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై దృష్టి సారించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి జగన్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష జరిపారు.

డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్య నారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌ రెడ్డి, వరప్రసాద్, బి.మధుసూదన్‌ రెడ్డి, కె.ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు వైయస్‌ జగన్‌. అభ్యర్థి ఎంపికను పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేసినట్లు సమాచారం. అన్ని కోణాలను పరిగణలోని తీసుకున్న తర్వాత అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఇదిలా వుండగా.. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కల్యాణ చక్రవర్తికి లేదా దుర్గాప్రసాద్ భార్యకు ఇచ్చే టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

ALSO READ: కృష్ణా జిల్లాకు స్పెషల్ అవార్డు..

ALSO READ: కోవిడ్ వారియర్లకు ప్రత్యేక కోటా రిజర్వేషన్

ALSO READ: గ్రేటర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇదే..

ALSO READ: లిక్కర్ దందాలోను రివర్స్ టెండరింగ్.. రూ.108 కోట్లు ఆదా

ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన

ALSO READ: మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. పలువురి సంతాపం

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో