AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంపేసి సూట్‌కేస్‌లో సర్దేశారు.. రైళ్లో తీసుకెళ్లి పడేశారు.. ఢిల్లీలో ఓ యువతి ఘాతుకం.. సహకరించిన తల్లి, కాబోయే భర్త

హత్యలు చేయడంలో మగవారికేం తీసిపోమని నిరూపించింది ఢిల్లీకి చెందిన ఓ మహిళ.. కాబోయే భర్తతో ఏకంగా తన బాస్‌నే మర్డర్ చేసి సూట్‌కేస్‌లో సర్దేసింది..

చంపేసి సూట్‌కేస్‌లో సర్దేశారు.. రైళ్లో తీసుకెళ్లి  పడేశారు.. ఢిల్లీలో ఓ యువతి ఘాతుకం.. సహకరించిన తల్లి, కాబోయే భర్త
Balaraju Goud
|

Updated on: Nov 19, 2020 | 6:47 PM

Share

హత్యలు చేయడంలో మగవారికేం తీసిపోమని నిరూపించింది ఢిల్లీకి చెందిన ఓ మహిళ.. కాబోయే భర్తతో ఏకంగా తన బాస్‌నే మర్డర్ చేసి సూట్‌కేస్‌లో సర్దేసింది.. ఈ ఘటన దేశ రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీలో నీరజ్ గుప్తా అనే వ్యాపారవేత్త కనిపించడం లేదని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతడి దగ్గర పని చేస్తున్న పైజల్ అనే మహిళయే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్లో విచారించగా అసలు విషయం ఒప్పేసుకుంది.

నీరజ్ గుప్తా దగ్గర పైజల్ 10 సంవత్సరాలుగా పని చేస్తోంది. ఇదే క్రమంలో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కాగా, ఇటీవల పైజల్‌కు జుబేర్ అనే వ్యక్తితో పెళ్లికి నిశ్చితార్థం జరిగింది. నీరజ్‌కు విషయం తెలియడంతో ఫైజల్ ఇంటికి వచ్చి గొడవ చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఫైజల్ కాబోయే భర్త జుబేర్‌తో కలిసి ఇటుకతో నీరజ్ తలపై బలంగా మోదారు. దీంతో కుప్పకూలిన నీరజ్ పై విచక్షణారహితంగా దాడి చేసి కత్తితో కడుపులో పొడిచి, గొంతు కోసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌లో సర్దేసి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లి గుజరాత్ సమీపంలో పడేశారు. ఈ హత్యకు ఫైజల్ తల్లి కూడా సహకరించిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి