కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య(24) నిశ్చితార్థం ఈరోజు బెంగళూరులో వైభవంగా జరిగింది. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో ఈ నిశ్చితార్థం జరిగింది. పెళ్లికొడుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు మనవడు కూడా. నిశ్చితార్థ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ వైరాలను పక్కనపెట్టి నిశ్చితార్థ వేడుకలో యడియూరప్ప, శివకుమార్ సంతోషంగా గడపడం […]
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య(24) నిశ్చితార్థం ఈరోజు బెంగళూరులో వైభవంగా జరిగింది. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో ఈ నిశ్చితార్థం జరిగింది. పెళ్లికొడుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు మనవడు కూడా. నిశ్చితార్థ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ వైరాలను పక్కనపెట్టి నిశ్చితార్థ వేడుకలో యడియూరప్ప, శివకుమార్ సంతోషంగా గడపడం కనిపించింది. మరోవైపు ఎస్ఎం కృష్ణతో కూడా యడియూరప్ప కాసేపు ముచ్చటించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొనసాగి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ఎస్ఎం కృష్ణ 2017లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను గత సెప్టెంబర్ లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే.