బ్రేకింగ్ :పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కి ఉరిశిక్ష !

|

Dec 17, 2019 | 2:03 PM

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఉరి శిక్ష విధించింది అక్కడి కోర్టు.. దేశ ద్రోహం కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. పెషావర్ హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఈ కేసులో ముషారఫ్ స్టేట్ మెంట్ ను ఈ నెల 5 కల్లా రికార్డు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. 2007 నవంబరు 3 న రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఎమర్జన్సీ విధించినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని […]

బ్రేకింగ్ :పాక్ మాజీ అధ్యక్షుడు  ముషారఫ్ కి ఉరిశిక్ష !
Follow us on

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఉరి శిక్ష విధించింది అక్కడి కోర్టు.. దేశ ద్రోహం కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. పెషావర్ హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఈ కేసులో ముషారఫ్ స్టేట్ మెంట్ ను ఈ నెల 5 కల్లా రికార్డు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. 2007 నవంబరు 3 న రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఎమర్జన్సీ విధించినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్) ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ 2013 నుంచి పెండింగులో ఉంది. దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న ముషారఫ్ ను 2014 లో అభిశంసించారు కూడా. అయితే తన ఆరోగ్యం దృష్ట్యా ఆయన 2016 నుంచి దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు తాను సిధ్ధంగా ఉన్నానని, ఆయన ఆసుపత్రిలోని తన బెడ్ మీదినుంచి వీడియో మెసేజ్ పంపారు. జ్యూడిషియల్ కమిషన్ ఇక్కడికి వచ్చి.. తను చెప్పేది ఆలకించాలని, తన ఆరోగ్య పరిస్థితిని గమనించాలని ఆయన కోరారు. ఆ తరువాతే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. 76 ఏళ్ళ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన ఆరోగ్యంతో బాటు వృధ్ధురాలైన తన తల్లి హెల్త్ దృష్ట్యా కూడా తాను పాకిస్తాన్ కు తిరిగి రాలేనని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు.