ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌లలో 235 మిలియన్ యూజర్ల డేటా లీక్.!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, చైనాకు చెందిన టిక్‌టాక్, గూగుల్ సంస్థకు సొంతమైన యూట్యూబ్‌ నుంచి దాదాపు 235 మిలియన్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటా..

  • Ravi Kiran
  • Publish Date - 4:13 pm, Fri, 21 August 20
ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌లలో 235 మిలియన్ యూజర్ల డేటా లీక్.!

Data of 235 million Users Leak: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, చైనాకు చెందిన టిక్‌టాక్, గూగుల్ సంస్థకు సొంతమైన యూట్యూబ్‌ నుంచి దాదాపు 235 మిలియన్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటా డార్క్ వెబ్‌లో లీకైనట్లు కాంపారిటెక్ అనే వెబ్‌సైట్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ డేటా లీక్ వెనుక ఓ అన్‌సెక్యూర్డ్ డేటాబేస్ హస్తం ఉన్నట్లు వారు తెలిపారు.

అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి రెండు విడతలుగా 100 మిలియన్లకు పైగా డేటా లీకైందని.. ఆ తర్వాత టిక్‌ టాక్‌ నుంచి 42 మిలియన్లు, ఇక యూట్యూబ్ నుంచి 4 మిలియన్ల యూజర్ల వ్యక్తిగత డేటా లీకైంది. వీటిల్లో ప్రొఫైల్ నేమ్, పూర్తి పేరు, ప్రొఫైల్ ఫోటో, అకౌంట్ వివరాలు, నెంబర్ అఫ్ ఫాలోయర్స్, లైక్స్, ఫోన్ నెంబర్ వంటివి ఉన్నాయి.

ఈ సమాచారం మొత్తం స్పామర్స్, సైబర్ క్రిమినల్స్‌కు ఉపయోగపడుతుందని కాంపారిటెక్ వెబ్‌సైట్ ఎడిటర్ పాల్ బిస్చెఫ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గత నెల షైనీ హంటర్స్‌ అనే హ్యాకింగ్ గ్రూప్  18 కంపెనీలకు చెందిన 386 మిలియన్ల యూజర్ల డేటాను లీక్ చేయడమే కాకుండా.. ఈ డేటాను అందరూ డౌన్ లోడ్ చేసే విధంగా ఒక ఫోరమ్‌లో అప్ లోడ్ చేశారు.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..