D-Mart: ముంబయి లో ఇల్లు కొన్న డి-మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ..ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు!

ఇల్లు కొనుక్కోవడం అంటే అందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. పిండి కొలదీ రొట్టెలా అవకాశాన్ని బట్టి.. తాహతును బట్టి సొంత ఇల్లు సమకూర్చుకోవాలని అనుకుంటారు అందరూ.

D-Mart: ముంబయి లో ఇల్లు కొన్న డి-మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ..ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు!
D Mart
Follow us

|

Updated on: Apr 03, 2021 | 5:32 PM

D-Mart: ఇల్లు కొనుక్కోవడం అంటే అందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. పిండి కొలదీ రొట్టెలా అవకాశాన్ని బట్టి.. తాహతును బట్టి సొంత ఇల్లు సమకూర్చుకోవాలని అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే డీ-మార్ట్ గురించి అందరికీ తెలిసిందే కదా. దాని అధినేత రాధాకృష్ణన్ దమాని ముంబయిలో ఇల్లు కొన్నారు. కొంటే కొనొచ్చు.. దానిలో వింతేముంది అనుకుంటున్నారా? ఆగండి..ఆ ఇంటి గురించి చెబితే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకో తెలుసుకోండి మరి..

ముంబయిలోని మల్బార్ హిల్స్ అంటే కోటీశ్వరులు.. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉండే ప్రాంతం. అక్కడ రాధాకృష్ణన్ ఇల్లు కొన్నారు. అది కూడా విశేషం కాదు కానీ, ఆ ఇల్లు ఖరీదు వెయ్యి కోట్లు. మీరు చదివింది నిజమే..అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలతో రాధాకృష్ణన్ ఇల్లు కొన్నారు. ఇప్పుడు చెప్పండి షాక్ అయ్యారా లేదా? ఇక ఈ ఇంటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఇల్లు మొత్తం 5752.22 sft విస్తీర్ణంతో ఉంటుంది. దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలు. దీనిని రాధాకృష్ణ దమాని అతని సోదరుడు గోపీకిషన్ కలిసి కొన్నారు. ముంబయికి చెందిన రాయ్ చంద్ అండ్ సన్స్, పరేష్ చంద్ అండ్ సన్స్, ప్రేమ్ చంద్ రాయ్ చంద్ అండ్ సన్స్ దగ్గర ఈ భవనాన్ని కొనుగోలు చేశారు.

ఈ భవనం కొనుగోలు చేసినందుకు గానూ 30 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టారు. మార్చి 31వ తేదీన ఈ ఇంటిని కొన్నారు.

రాధాకృష్ణన్ దమాని ముంబయి టెనెంట్ బ్లాక్ లో ఒక్క రూమ్ అపార్ట్మెంట్ నుంచి తన జీవితం ప్రారంభించారు. సూపర్మార్ట్స్ లిమిటెడ్ చైర్మన్ గా ఆయన వ్యాపారాన్ని విస్తరించారు. ఈయన వ్యాపారాల్లో బాగా పాప్యులర్ అయిన రిటైల్ చైన్ డి-మార్ట్.

ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితా 2020 ప్రకారం రాధాకృష్ణన్ దమాని దేశంలోని నాలుగో అతి పెద్ద ధనవంతుడు. ఈయన ఆస్తుల విలువ 15.4 బిలియన్ డాలర్లు.

Also Read: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ‘రూపాయికే ఇడ్లీ’ అందించిన బామ్మ కమలాత్తాళ్‌కు సొంతిల్లు

Indigo Baggage Service: ఇకపై ఎయిర్‌పోర్టుకు లగేజ్‌ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. సరికొత్త సేవలను ప్రారంభించిన ఇండిగో..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే