AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంచుకొస్తున్న నివార్.. తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితిపై మోదీ ఆరా.. అన్ని విధాలుగా సాయపడతామని భరోసా

నివార్ తుఫాను ముంచుకొస్తోన్న నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితి పై ప్రధాన మంత్రి మోదీ ఆరాతీసారు. అక్కడి పరిస్థితులను గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి..

ముంచుకొస్తున్న నివార్.. తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితిపై మోదీ ఆరా.. అన్ని విధాలుగా సాయపడతామని భరోసా
Venkata Narayana
| Edited By: |

Updated on: Nov 24, 2020 | 2:36 PM

Share

నివార్ తుఫాను ముంచుకొస్తోన్న నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితి పై ప్రధాన మంత్రి మోదీ ఆరాతీసారు. అక్కడి పరిస్థితులను గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి వి. నారాయణసామితో మోదీ మాట్లాడారు. ‘నివార్ తుఫాను ఫలితంగా తలెత్తిన స్థితి పై తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి వి.నారాయణసామితోను మాట్లాడాను.. కేంద్రం తరఫున అన్ని విధాలుగా సాయపడతామంటూ హామీని ఇచ్చాను.. ప్రభావిత ప్రాంతాలలో నివసించే వారు భద్రంగా, క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.’ అని ట్విటర్ ద్వారా ప్రధాన మంత్రి వెల్లడించారు.

ఇలా ఉంటే, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశల్లో ప్రయాణించి మంగళవారం ఉదయం 5.30కు తుఫానుగా మారింది. పుదుచ్చేరికి తూర్పు, ఆగ్నేయ దిశగా 410 కి.మీ.లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 450 కి.మీ.ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులోని కరైకల్-మామల్లాపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో బుధవారం సాయంత్రం తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని దాటనుందని తెలుస్తోంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 కి.మీ.ల నుంచి గరిష్టంగా 120 కి.మీ.ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!