ముంచుకొస్తున్న బురవి తుఫాను.. పొంచి ఉన్న ముప్పు.. దక్షిణ అండమాన్‌ సమీపంలో మరో అల్పపీడనం

| Edited By: Team Veegam

Dec 04, 2020 | 1:43 PM

నివర్ తుఫాను నుంచి కోలుకోకముందే మరో తుఫాను దక్షిణ భారతాన్ని వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడుపై మరోసారి తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ముంచుకొస్తున్న బురవి తుఫాను.. పొంచి ఉన్న ముప్పు.. దక్షిణ అండమాన్‌ సమీపంలో మరో అల్పపీడనం
Follow us on

నివర్ తుఫాను నుంచి కోలుకోకముందే మరో తుఫాను దక్షిణ భారతాన్ని వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడుపై మరోసారి తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘బురేవి’ తుఫాన్‌గా మారింది. బుధవారం సాయంత్రం ఇది శ్రీలంకలోని ట్రింకోమలై ప్రాంతానికి తూర్పు ఈశాన్యంగా 70 కిలోమీటర్లు, తమిళనాడులోని పాంబన్‌కు తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బుధవారం రాత్రికి ట్రింకోమలై వద్ద తీరం దాటి, అనంతరం మన్నార్‌ గల్ఫ్‌, కొమెరిన్‌ ప్రాంతాల్లోకి ప్రవేశించనుంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని పాంబన్‌-కన్యాకుమారి మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మలయా ద్వీపకల్పంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని ఐఎండీ అధికారులు తెలిపారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారింది. ఇది తీవ్ర తుఫాన్ గా మారబోతున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడులో కన్యాకుమారి-పాంబన్ కు 700 తూర్పు ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది డిసెంబర్ 3న శ్రీలంక తీరాన్ని దాటి అక్కడి నుంచి పశ్చిమ దిశగా పయనించి కొమెరిన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి పశ్చిమ దిశగా పయనించి డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామున కన్యాకుమారి-పాంబన్ మధ్య తీరాన్ని దాటుతుంది. ఈ సమయంలో తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, డిసెంబర్ 2 నుంచి 4 వ తేదీ వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Read more:

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..