సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ త్రి మ‌చ్, ఏకంగా మూడు పెళ్లిళ్లు

ఒక‌టి కాదు, రెండు కాదు..ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్. అది కూడా భార్య‌ల నుంచి విడాకులు తీసుకున్నాక కాదు.

సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ త్రి మ‌చ్,  ఏకంగా మూడు పెళ్లిళ్లు

Updated on: Aug 22, 2020 | 12:29 PM

ఒక‌టి కాదు, రెండు కాదు..ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్. అది కూడా భార్య‌ల నుంచి విడాకులు తీసుకున్నాక కాదు. మ‌రీ ఇంత త్రి మ‌చ్ చేస్తే ఎంత త‌మవాడైతే మాత్రం ఖాకీలు క‌నిక‌రిస్తారా. వెంట‌నే అరెస్ట్ చేసి క‌టక‌టాల్లోకి నెట్టారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎడ్ల శంకరయ్య (39) సహరా ఎస్టేట్‌లోని గందార అపార్టుమెంటులో నివాసం ఉంటుంన్నాడు. ఇతడు‌ 2011లో ఒక మహిళను పెళ్లి చేసుకుని విబేధాల కార‌ణంగా వదిలేశాడు. అనంతరం 2016లో మరో మహిళ శారద (38)ని వివాహం చేసుకున్నాడు. 2017 లో ఈ దంప‌తుల‌కు ఒక ఆడ‌బిడ్డ జ‌న్మించింది. అయిలే శంక‌ర‌య్య ట్రాన్స్‌ఫ‌ర్ అవ్వ‌డంతో దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు స్టార్ట‌య్యాయి. ఈ క్ర‌మంలో బ్యూటీ పార్ల‌ర్ నిర్వ‌హిస్తోన్న మంజుల రాణి అనే మ‌హిళ‌ను శంక‌ర‌య్య 2019 న‌వంబ‌ర్ 30న మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న శార‌ద ఇటీవ‌ల‌ వనస్థలిపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి శంక‌ర‌య్య‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !