ఎదురుకాల్పులు.. తృటిలో తప్పించుకున్న కీలక నేతలు

విశాఖ సరిహద్దుల్లోని ఏవోబీలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. స్వాభిమాన్ ఆంచల్ దోరగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు..

ఎదురుకాల్పులు.. తృటిలో తప్పించుకున్న కీలక నేతలు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 7:10 PM

విశాఖ సరిహద్దుల్లోని ఏవోబీలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. స్వాభిమాన్ ఆంచల్ దోరగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు మంగళవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేతలు తృటిలో తప్పించుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసు బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టడంతో మావోయిస్టులు సంఘటనాస్థలంలోనే ఆయుధాలు, పేలుడు పదార్థాలు వదిలి పారిపోయారు. ఇందులో 303 రైఫిల్, మ్యాగ్జైన్, 10 రౌండ్ల బుల్లెట్లు, కాట్రడ్జ్ లతోపాటు రెండు రిమోట్ల, మూడు మ్యాన్ ప్యాక్ లు, శాటిలైట్ ఫోన్‌లతోపాటు కిట్ బ్యాగుల ఘటన స్థలంలో లభించినట్లుగా పోలీసులు తెలిపారు. కిట్ బ్యాగుల్లో మావోయిస్టుల యూనిఫాంలు ఉన్నాయని తెలిపారు. ఎదురుకాల్పులతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏవోబీలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.