హంతకులను పట్టించిన సెల్‌ఫోన్‌

మధ్యప్రదేశ్ లో హత్యకు గురైన గోరక్ష విభాగానికి చెందిన జిల్లా ఇన్‌చార్జి రవి విశ్వకర్మ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటన సంధించి సెల్‌ఫోన్‌లోని వీడియో సాక్షిగా నిందితులను పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

హంతకులను పట్టించిన సెల్‌ఫోన్‌
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2020 | 4:18 PM

మధ్యప్రదేశ్ లో హత్యకు గురైన గోరక్ష విభాగానికి చెందిన జిల్లా ఇన్‌చార్జి రవి విశ్వకర్మ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటన సంధించి సెల్‌ఫోన్‌లోని వీడియో సాక్షిగా నిందితులను పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

హౌషంగాబాద్ జిల్లాలోని పిపరియా పట్టణంలో హత్యకు పాల్పడ్డ వారిని సెల్‌ఫోన్‌ పట్టించింది. శుక్రవారం జరిగిన హత్యకు సంబంధించి 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగానికి చెందిన జిల్లా ఇన్‌చార్జి రవి విశ్వకర్మ, హౌషంగాబాద్ కు చెందిన మరో ఇద్దరితో కలిసి కారులో వెళ్తుండగా దారుణహత్యకు గురయ్యాడు. భోపాల్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపారియా పట్టణంలో ఈ సంఘటన జరిగింది. హత్య కేసుతో సంబంధం ఉన్న 9మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ అవదేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. వీరిపై ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హోషంగాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన విశ్వహిందూ పరిషత్‌ నాయకుడిపై దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. సెల్‌ఫోన్‌లోని వీడియా ఆధారంగా నిందితులను సులువుగా పట్టుకోగలిగామన్నారు. దోషులను విచారిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించిన మరి కొందరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కరికీ రూ.10వేలు అందజేస్తామని పిపరియా పోలీసులు ప్రకటించారు.