గుంటూరు జిల్లా : క్లాస్‌మేట్‌ను గ‌ర్భవతిని చేసిన టెన్త్ స్టూడెంట్….

టీనేజ్ స‌మ‌యంలో పేరెంట్స్ పిల్ల‌ల‌ను ఓ కంట క‌నిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ స‌మ‌యంలో వారి వ‌య‌సు పెడు దోవ‌లవైపు ఆక‌ర్షిస్తుంది. స‌రైన కేర్ తీసుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

గుంటూరు జిల్లా :  క్లాస్‌మేట్‌ను గ‌ర్భవతిని చేసిన టెన్త్ స్టూడెంట్....
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2020 | 4:23 PM

టీనేజ్ స‌మ‌యంలో పేరెంట్స్ పిల్ల‌ల‌ను ఓ కంట క‌నిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ స‌మ‌యంలో వారి వ‌య‌సు పెడు దోవ‌లవైపు ఆక‌ర్షిస్తుంది. స‌రైన కేర్ తీసుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. తాజాగా గుంటూరు జిల్లాలో క్లాస్‌మేట్‌ను ప్రేమ పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు ఓ టెన్త్ సూడెంట్. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అమృతలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు జిల్లా పరిష‌త్ ఉన్న పాఠ‌శాల‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చదువుతున్నాడు. అదే స్కూల్‌లో ఓ బాలిక కూడా టెన్త్ క్లాస్ చదువుతోంది. ఆమెపై కన్నేసిన బాలుడు… ప్రేమ పేరుతో బాలిక వ‌ద్ద చనువు పెంచుకున్నాడు. చదువు పూర్తయి ఉన్న‌త స్థాయికి వెళ్లాక మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడు.

అయితే ఇటీవల బాలిక శరీరంలో మార్పులు రావ‌డంతో.. ఆమె తల్లి నిల‌దీయ‌గా అస‌లు విష‌యం చెప్పింది. దీంతో కుమార్తెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా గర్భంతో ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో బాలిక త‌ల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ‌ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు మైనర్ కావడంతో అతడి వివరాలు బయటకు వెల్ల‌డించలేదు.