COVID 19: వాళ్లకు జాలి, దయ, మనసాక్షి ఏమి ఉండదు. నచ్చని వారిని అమానుషంగా.. ఇంకా చెప్పాలంటే దారుణంగా చంపేస్తుంటారు. అడ్డుగా ఉన్నవారిని అయితే బానిసలుగా చేసుకుని హింసిస్తారు. ఇక మహిళలను అయితే సెక్స్ బొమ్మలా మార్చి నరకయాతనకు గురి చేస్తుంటారు. ఎదుటివారి బాధ, ఆవేదన నుంచి సంతోషాన్ని పొందే ఆ రాక్షసులే ఐసీస్ ఉగ్రవాదులు. తమదైన తీరుతో ప్రపంచాన్ని వణికించే వీరికి ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. అది కూడా కంటికి కనిపించని ‘కరోనా వైరస్’ వాళ్లను వణికిస్తోంది.
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటినీ వణికించిన ఈ మహమ్మారి ఐసీస్ ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదంటూ ఐసీస్ ప్రకటించింది.
దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అల్-నబా మ్యాగ్‌జైన్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కరోనా తీవ్రత ఉన్న దేశాలకు వెళ్లకూడదని.. వీలయినన్ని ఎక్కువసార్లు చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని ఉగ్రవాదులను ఐసీస్ సూచించింది.
మరోవైపు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకోవాలని.. మంచి నీటి కుండలపై మూతలు ఉంచుకోవాలని తెలిపింది. అలాగే తుమ్మినప్పుడు నోటికి చేతులను అడ్డం పెట్టుకోవాలని ఉగ్రవాదులకు చెప్పింది. ఏది ఏమైనా ప్రపంచాన్ని వణికించే కసాయి ఉగ్రవాదులను సైతం కరోనా వణికిస్తోందంటే.. ‘జైహో కరోనా’ అని చెప్పక తప్పదు.
కాగా, చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం 156 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 6 వేల మందికిపైగా కోవిడ్ 19 బారిన పడి మృతి చెందగా.. బాధితుల సంఖ్య 1,59,844కు చేరింది. భారత్‌లో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ సంఖ్య 110కు చేరింది.
For More News:
కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..
ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?
రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!
ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..
Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..
కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం
గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..
ISIS pores over religious texts. Comes out in favor of putting your trust in God but also in favor of quarantine, hand-washing & running from the sick like from a lion. Their rivals in Qom stopped after No. 1. Thx to @ajaltamimi for his translation https://t.co/b08Jffvj6t
— Rukmini Callimachi (@rcallimachi) March 13, 2020