కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?
COVID 19: ప్రపంచదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ గతంలోనే ఊహించారా.? అంటే అవునని అంటున్నారు ఆయన దగ్గర దశాబ్దన్నర కాలం పని చేసిన బాడీగార్డ్ మ్యాట్ ఫిడ్డెస్. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు గురించి స్పందించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఏదొక రోజు ప్రపంచమొత్తం సుక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని జాక్సన్ చెప్పినట్లు మ్యాట్ ఫిడ్డెస్ తెలిపారు. అందుకే మైకేల్ […]
COVID 19: ప్రపంచదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ గతంలోనే ఊహించారా.? అంటే అవునని అంటున్నారు ఆయన దగ్గర దశాబ్దన్నర కాలం పని చేసిన బాడీగార్డ్ మ్యాట్ ఫిడ్డెస్. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు గురించి స్పందించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘ఏదొక రోజు ప్రపంచమొత్తం సుక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని జాక్సన్ చెప్పినట్లు మ్యాట్ ఫిడ్డెస్ తెలిపారు. అందుకే మైకేల్ ఎప్పుడూ ఫేస్ మాస్క్, గ్లౌజులు ధరించేవారని.. వైరస్ వ్యాధుల బారిన పడకుండా ఎలప్పుడూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారని జాక్సన్ బాడీగార్డ్ వివరించారు. అంతేకాకుండా మైకేల్ జాక్సన్ ప్రతీసారి ఒకటి చెబుతూ ఉండేవారట. ‘నేను ఎప్పుడూ అనారోగ్యానికి గురికాను. నా ఫ్యాన్స్‌ను నిరశాపరచను. ప్రతినిత్యం వారిని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని చెప్పవారని.. ఆయన ఇప్పుడు బ్రతికి ఉన్నా.. ఇవే మాటలు చెబుతారని మ్యాట్ ఫిడ్డెస్ వెల్లడించారు.
For More News:
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?
కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?