మేమున్నాం.. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు బాల‌య్య భ‌రోసా

దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్ నడుస్తున్నా హాస్పిటల్స్‌లో వైద్యులు, నర్సులు రోగులకు సేవలందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా క‌రోనాపై యుద్ధానికి మేమున్నామంటూ ముందుకు వ‌చ్చారు...

మేమున్నాం.. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు బాల‌య్య భ‌రోసా
Follow us

|

Updated on: Mar 27, 2020 | 8:56 AM

కోవిడ్- 19ః ప్ర‌పంచ‌దేశాల‌న్ని ఇప్పుడు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో యుద్ధం చేస్తున్నాయి. మందులేని మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. దేశంలో వైర‌స్ విస్త‌రించ‌కుండా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నాయి. ఇది భయంకరమైన అంటు వ్యాధి అని తెలిసినా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్ నడుస్తున్నా హాస్పిటల్స్‌లో వైద్యులు, నర్సులు రోగులకు సేవలందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా క‌రోనాపై యుద్ధానికి మేమున్నామంటూ ముందుకు వ‌చ్చారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ అయిన బాలకృష్ణ.. ఆ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌కి ఒక లేఖ రాశారు. వైద్య సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి అండగా హాస్పిటల్ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంతకు ముందు ప్రపంచం ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎపుడు చూడలేదు. కరోనా మహామ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మనమందరం బాధ్యతయుతమైన పౌరులుగా మెలగాలని పిలుపునిచ్చారు.

వైద్యో నారాయణో హరి: అనే సూక్తిని నిజం చేస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ త‌న హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసాడు. డాక్టర్లందరు ఆరోగ్య సంరక్షణ సేవలో అనుక్షణం అప్రమత్తమై మెలగాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా డాక్టర్లు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోని మీతో పాటు మీ ప్రియమైన వారు సురక్షితంగా ఉండటానికి సహాయ పడండి అంటూ కోరారు. మనమంతా పెద్ద కుటుంబం. మీరు చేస్తున్న సేవలు వెల కట్టలేనివి. ఈ కరోనా మహామ్మారి పోరాటంలో మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడినా.. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఆసుపత్రి అన్ని జాగ్రత్తలతో పాటు బాధ్యతలు కూడా తీసుకుంటుందని స్ప‌ష్టం చేశారు.

మనమంతా పెద్ద కుటుంబం..ఇప్పుడు క‌ర‌నా కట్టడిలో అలుపెరగని మీ సేవలు, విధుల పట్ల మీరు చూపిస్తున్న నిబద్దతకు మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సురక్షితంగా ఉండండి, మీ అంతులేని ఆత్మస్తెర్యాన్ని కొనసాగించండి’’ అంటూ బాల‌కృష్ణ త‌న లేఖలో పేర్కొన్నారు.