Covid-19: వినియోగదారులకు షాక్.. భారీగా పెరగనున్న ఫోన్ల ధరలు

| Edited By:

Feb 16, 2020 | 5:30 PM

Covid-19: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పెంపు […]

Covid-19: వినియోగదారులకు షాక్.. భారీగా పెరగనున్న ఫోన్ల ధరలు
Follow us on

Covid-19: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పెంపు 10శాతం వరకు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్ల ధరలు 6-7శాతం పెరిగే అవకాశం ఉంది.

కాగా.. ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లపై ప్రభావం మాత్రం నామమాత్రమే. ఎందుకంటే భారత్‌లో వీటి మార్కెట్‌ వాటా చాలా తక్కువగా ఉండటమే కారణం. కరోనా వైరస్‌ కారణంగా చైనాలోని విడిభాగాలు తయారయ్యే కంపెనీలు మూతపడటంతో ఆ ప్రభావం ఫోన్ల ధరలపై చూపనుంది. దీని ప్రభావం అత్యధికంగా 180 రోజులపాటు ఉండే అవకాశం ఉంది. చైనా సంస్థ షావోమికి చెందిన రెడ్‌మీ8 ఫోన్‌ ధరను ఇప్పటికే పెంచేసింది.