ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఐదు లక్షలు దాటిన రికవరీలు..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,492 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 8702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరింది.

ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఐదు లక్షలు దాటిన రికవరీలు..
Follow us

|

Updated on: Sep 17, 2020 | 7:06 PM

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,492 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 8702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరింది. వీటిల్లో 88197 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,08,088 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5177కి చేరుకుంది. (Coronavirus In Andhra Pradesh)

అటు గడిచిన 24 గంటల్లో 10,712 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 72 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1064 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 545, చిత్తూర్ 905, గుంటూరు 550, కడప 637, కృష్ణ 367, కర్నూలు 394, నెల్లూరు 610, శ్రీకాకుళం 567, విజయనగరం 526, , ప్రకాశంలో 705, విశాఖపట్నం 449 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 82,447 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 564 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!