తెలంగాణలో ఒక్క రోజు ఎన్ని కేసులంటే.?
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 510 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందులో 11,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,885 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 34,323 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 7 మంది కరోనాతో మృతిచెందగా.. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 422కి చేరింది. కాగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 11,003 టెస్టులు చేశారు.
ఇక జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 510 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 106, మేడ్చల్ జిల్లాలో 76, సంగారెడ్డిలో 10, ఖమ్మంలో 3, వరంగల్ అర్బన్‌లో 73, వరంగల్ రూరల్ 1, నిర్మల్ 1, కరీంనగర్‌లో 87, జగిత్యాల 36, యాదాద్రిలో 1, మహబూబ్ నగర్ 50, పెద్దపల్లిలో 8, మెదక్‌లో 13, మంచిర్యాలలో 3, మహబూబాబాద్ 36, భద్రాద్రి కొత్తగూడెం 11, జయశంకర్ భూపాలపల్లి 26, నల్గొండలో 24, ఆదిలాబాద్‌లో 11, ఆసిఫాబాద్ 4, నాగర్‌కర్నూలు జిల్లాలో 27, వికారాబాద్ జిల్లాలో 11, జనగాం జిల్లాలో 12, నిజామాబాద్ జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 12, గద్వాల జిల్లాలో 3, ములుగులో 9 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.




