ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 71,577 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,751 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు..

Updated on: Oct 01, 2020 | 6:51 PM

Coronavirus Positive Cases: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 71,577 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,751 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. ఇందులో 57,858 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,36,508 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 41 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,869కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 58.78 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 333, చిత్తూరు 888, తూర్పుగోదావరి 986, గుంటూరు 594, కడప 400, కృష్ణా 424, కర్నూలు 265, నెల్లూరు 472, ప్రకాశం 783, శ్రీకాకుళం 301, విశాఖపట్నం 277, విజయనగరం 275, పశ్చిమ గోదావరి 753 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 98 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 662 మంది కరోనాతో మరణించారు.

Also Read:

ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..