దేశంలో కరోనా: 97,893 పాజిటివ్ కేసులు, 1,132 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 97,893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,132 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా: 97,893 పాజిటివ్ కేసులు, 1,132 మరణాలు

Updated on: Sep 17, 2020 | 10:59 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 97,893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,132 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 51,18,253కి చేరుకుంది. ఇందులో 10,09,976 యాక్టివ్ కేసులు ఉండగా.. 83,198 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 40.25 లక్షల మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (Coronavirus Positive Cases India)

ఇక అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 23,365 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ 11,21,221 కరోనా కేసులు ఉండగా.. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువ అవుతోంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 78.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63 శాతంగా ఉంది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!