ప్రధాని మోదీ 70 వ జన్మ దినోత్సవం, బీజేపీ వారోత్సవ సంరంభం

ప్రధాని మోదీ గురువారం 70 వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్' పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన..

ప్రధాని మోదీ 70 వ జన్మ దినోత్సవం, బీజేపీ వారోత్సవ సంరంభం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 17, 2020 | 11:01 AM

ప్రధాని మోదీ గురువారం 70 వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ వారం రోజుల పాటు ‘సేవా సప్తాహ్’ పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. సేవా సప్తాహ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా 70 చోట్ల రక్తదాన శిబిరాలను, నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అనేకచోట్ల మొక్కలు నాటుతున్నారు. యూపీ లోని చప్రౌలీ గ్రామంలో బీజేపీ ఛీప్జ్ జేపీ.నడ్డా రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ కార్యకర్తలు 70 కేజీల బరువైన లడ్డూను తయారు చేసి శివన్ కామాక్షీ అమ్మన్ ఆలయంలో శివునికి నైవేద్యంగా సమర్పించారు. హిందూ సేన ఢిల్లీలో హోమం నిర్వహిస్తోంది. పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా వలస  వఛ్చిన హిందువులకు ఢిల్లీలో కుట్టు మిషన్లు, ఈ-రిక్షాలు, తదితరాలను అందించనున్నారు.