కరోనా అప్డేట్: ఏపీలో లక్షా 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు..

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో60,797 శాంపిల్స్ పరీక్షించగా.. 9,276 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనా అప్డేట్: ఏపీలో లక్షా 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు..

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో60,797 శాంపిల్స్ పరీక్షించగా.. 9,276 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,50,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 72,188 యాక్టివ్ కేసులు ఉండగా.. 76,614 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు ఇప్పటివరకు 1407 మంది వైరస్ కారణంగా మరణించారు.

ఇక గడిచిన 24 గంటల్లో 12,750 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 58 మంది మహమ్మారి బారినపడి చనిపోయారు. జిల్లాల వారీగా చూసుకుంటే.. కర్నూలులో అత్యధికంగా 1,234 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురంలో 1,128, విశాఖపట్నంలో 1,155 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత చిత్తూరులో 949, తూర్పు గోదావరిలో 876, గుంటూరులో 1001, కడపలో 547, కృష్ణలో 357, నెల్లూరులో 559, ప్రకాశంలో 402, శ్రీకాకుళంలో 455, విజయనగరంలో 119, పశ్చిమ గోదావరిలో 494 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

Also Read:

ఏపీలోకి వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ..

ఏపీలో 396 హాట్ స్పాట్స్.. ఆ రెండు జిల్లాల్లోనే అత్యధికం..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..

Click on your DTH Provider to Add TV9 Telugu