AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఈ తరుణంలో ఇది మనకు సవాల్’, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో మోదీ

ఈ కరోనా వైరస్ సంక్షోభ సమయంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020 నిర్వహించడం మనకు సవాల్ అన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి సమయంలో కూడా ఈ విధమైన కార్యక్రమాలను జరపడం విశేషమన్నారు.  స్మార్ట్ ఇండియా హ్యాక థాన్ గ్రాండ్ ఫినాలేలో ..

'ఈ తరుణంలో ఇది మనకు సవాల్', స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో మోదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 01, 2020 | 5:33 PM

Share

ఈ కరోనా వైరస్ సంక్షోభ సమయంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020 నిర్వహించడం మనకు సవాల్ అన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి సమయంలో కూడా ఈ విధమైన కార్యక్రమాలను జరపడం విశేషమన్నారు.  స్మార్ట్ ఇండియా హ్యాక థాన్ గ్రాండ్ ఫినాలేలో  వివిధ యూనివర్సిటీలు, కళాశాలల విద్యార్థులను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో ఇంటరాక్ట్ అయ్యారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో  విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం దైనందిన జీవితాల్లో ముఖ్యంగా స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి  ఈ విధమైన కార్యక్రమాలు తోడ్పడతాయని మోదీ అన్నారు. ప్రపంచంలో ఇంత భారీగా ఆన్ లైన్ ద్వారా హ్యాకథాన్ నిర్వహించడం చెప్పుకోదగిన విషయమన్నారు. దేశంలో యువతకు ఇదివరకు కన్నా ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు.

కాగా 37 ప్రభుత్వ శాఖలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20 పరిశ్రమలకు సంబంధించి 243 ప్రశ్నలను పరిష్కరించేందుకు సుమారు పది వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పోటీ పడనున్నారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజులపాటు జరగనుంది.