AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ అప్డేట్: కోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు…

ప్రపంచవ్యాప్తంగా 10,249,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 504,490 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 5,557,974 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వరల్డ్ అప్డేట్: కోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు...
Ravi Kiran
|

Updated on: Jun 29, 2020 | 11:48 AM

Share

యావత్ మానవజాతిని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10,249,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 504,490 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 5,557,974 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 1,63,172 కేసులు, 3,454 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో కొంచెం ప్రజలకు అది ఊరటను ఇస్తోంది.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్,బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(2,637,077), మరణాలు(128,437) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 1,345,254 నమోదు కాగా, మృతుల సంఖ్య 57,658కు చేరింది. ఇక రష్యాలో 634,437 పాజిటివ్ కేసులు, 9,073 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 549,197 నమోదు కాగా, మృతుల సంఖ్య 16,487కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో  19,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬380 కరోనా మరణాలు సంభవించాయి.

Follow Us
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని