సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు సరాసరి అమ్మ ఖాతాలోకి..

|

Apr 14, 2020 | 5:19 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఈ సంవత్సరానికి గానూ.. 3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించమని సీఎం జగన్ వెల్లడించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరాసరి విద్యార్ధుల తల్లి అకౌంట్‌లోకే ఫీజు డబ్బులు చెల్లిస్తామని.. ప్రతి త్రైమాసికం పూర్తయిన తర్వాత డబ్బు జమ చేస్తామన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి కాలేజీలు […]

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు సరాసరి అమ్మ ఖాతాలోకి..
Follow us on

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఈ సంవత్సరానికి గానూ.. 3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించమని సీఎం జగన్ వెల్లడించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరాసరి విద్యార్ధుల తల్లి అకౌంట్‌లోకే ఫీజు డబ్బులు చెల్లిస్తామని.. ప్రతి త్రైమాసికం పూర్తయిన తర్వాత డబ్బు జమ చేస్తామన్నారు.

అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి కాలేజీలు అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా, జగనన్న విద్యాదీవెన పధకం కింద ప్రతీ విద్యార్ధికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దక్కేలా చేయాలనీ ఏపీ [ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పధకం వర్తించాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. అలాగే ‘అమ్మఒడి’ పధకం కింద పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

ఏపీ: రెడ్‌జోన్‌లో 41.. ఆరెంజ్‌ జోన్‌లో 45.. గ్రీన్ జోన్‌లో 590… షరతులు వర్తిస్తాయి.

మందుబాబులకు ‘లిక్కర్ దానం’.. వీడియో వైరల్.. హైదరాబాద్ యువకుడి అరెస్ట్..