హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…

|

Mar 26, 2020 | 6:34 PM

Coronavirus Effect: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు తప్పితే ప్రజారవాణా అంతా బంద్ కావడంతో హాస్టళ్లలో ఉండేవారికి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిన్న తెలంగాణ పోలీసులు ఎన్ఓసీలు ఇచ్చి తమ సొంతూళ్లకు వెళ్ళమని చెప్పినా చాలామంది రాష్ట్ర సరిహద్దుల్లోనే పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని హాస్టళ్ల నిర్వాహకులతో చర్చలు జరిపింది. ఇక […]

హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట...
Follow us on

Coronavirus Effect: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు తప్పితే ప్రజారవాణా అంతా బంద్ కావడంతో హాస్టళ్లలో ఉండేవారికి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిన్న తెలంగాణ పోలీసులు ఎన్ఓసీలు ఇచ్చి తమ సొంతూళ్లకు వెళ్ళమని చెప్పినా చాలామంది రాష్ట్ర సరిహద్దుల్లోనే పడిగాపులు పడ్డారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని హాస్టళ్ల నిర్వాహకులతో చర్చలు జరిపింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో హాస్టళ్లు తెరిచే ఉంచుతామని యజమానులు స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఉంటున్నవారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు హామీ ఇచ్చారు.

తమకు వాటర్ ట్యాంకర్లుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న చాలామందికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా హాస్టళ్లల్లో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారని హాస్టళ్ల నిర్వాహకులు తెలియజేశారు.

For More News:

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748