AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటిలో వేళ్ళు పెట్టి మరీ కరోనా టెస్టులు.. వీడేం డెంటిస్టురా బాబోయ్

తూర్పుగోదావరి జిల్లాలో ఓ డెంటిస్టు హోం క్వారెంటైన్‌లో వున్న వారందరినీ హడలెత్తించాడు. కనీస జాగ్రత్తలు పాటించకుండా కరోనా టెస్టులు చేసి బెంబేలెత్తించాడు.

నోటిలో వేళ్ళు పెట్టి మరీ కరోనా టెస్టులు.. వీడేం డెంటిస్టురా బాబోయ్
Rajesh Sharma
|

Updated on: Apr 22, 2020 | 6:10 PM

Share

తూర్పుగోదావరి జిల్లాలో ఓ డెంటిస్టు హోం క్వారెంటైన్‌లో వున్న వారందరినీ హడలెత్తించాడు. కనీస జాగ్రత్తలు పాటించకుండా కరోనా టెస్టులు చేసి బెంబేలెత్తించాడు. సదరు డెంటిస్టు చేతివాటం చూసి క్వారెంటైన్‌లో వున్న వారిలో చాలా మంది పరీక్షలు చేయించుకోకుండానే తప్పించుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కరోన టెస్టులు చేసిన డాక్టర్ స్థానికులను బెంబేలెత్తించాడు. నగరం పీహెచ్‌సీలో బుధవారం కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు వైద్యాధికారులు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి వచ్చిన హౌస్ కోరంటైన్ ఉన్న 60 మందికి టెస్ట్ నిర్వహించారు.

టెస్టులు చేసే విధానం కరెక్ట్‌గా లేదంటూ పరీక్షలు చేయించు కోకుండా వెనుదిరిగి పోయారు కొంత మంది హౌజ్ క్వారెంటైన్ వ్యక్తులు. డాక్టర్ ప్రతి ఒక్కరి నోటిలో వేళ్ళు పెట్టి టెస్టులు చేస్తుండడంతో భయంతో వెనుతిరిగారు స్థానికులు. టెస్టులు చేసే డాక్టర్ డెంటిస్ట్ కావడంతో కనీసం చేతి గ్లౌజులు మార్చుకోకుండా డాక్టర్ పరీక్షలు జరిపాడు. ఈ ఉదంతం వల్ల మరికొందరికి కరోనా వ్యాపించే ప్రమాదం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డెంటిస్టు వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతున్నారు.

Follow Us