తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

తిరుపతిలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ సెంటర్లన్నీ ఖాళీ కావడంతో భవనాలను టీటీడీకి అప్పగిస్తున్నారు అధికారులు. 

  • Ram Naramaneni
  • Publish Date - 9:19 am, Thu, 5 November 20
తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

తిరుపతిలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ సెంటర్లన్నీ ఖాళీ కావడంతో భవనాలను టీటీడీకి అప్పగిస్తున్నారు అధికారులు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో వసతి గృహాలు, సత్రాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా వినియోగించుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో విష్ణునివాసం, మధవం, శ్రీనివాసం, పద్మావతి నిలయాలను తిరిగి టీటీడీకి అప్పగించారు అధికారులు. గత ఏడు నెలలుగా వేల మందికి కోవిడ్ ట్రీట్మెంట్ అందించేందుకు వెంకన్న వసతి గృహాలు సాయపడ్డాయి. వెనక్కు తీసుకున్న భవనాలను ప్రస్తుతం శానిటైజ్ చేస్తోన్న టీటీడీ..ఆపై యధావిధిగా భక్తులకు కేటాయించనుంది. ఇకపై రాయలసీమ జిల్లాల నుచి వచ్చే కరోనా పేషంట్లకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లోని కోవిడ్ సెంటర్లలో మాత్రమే చికిత్స అందించనున్నారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

వికారాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య