ప్రకాశం జిల్లాలో బ్యాంకులకు కరోనా ఆంక్షలు

కరోనా రక్కసి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. కొద్ది రోజులు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన కొవిడ్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు..

ప్రకాశం జిల్లాలో బ్యాంకులకు కరోనా ఆంక్షలు
Follow us

|

Updated on: Jul 28, 2020 | 8:02 AM

కరోనా రక్కసి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. కొద్ది రోజులు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన కొవిడ్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. దీంతో స్థానిక వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ కు సిద్ధమవుతున్నారు.అదే దారిలో బ్యాంకులు చేరిపోయాయి.

ప్రకాశం జిల్లాలో నేటి నుండి బ్యాంకులకు ఆంక్షలను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం లీడ్ బ్యాంక్ మేనేజర్ యుగందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 223 కేసులు నమోదు అవడంతో జిల్లాల ఇప్పటి వరకు కరోనా పాజిటవ్‌ కేసుల సంఖ్య 4427కు చేరింది. అత్యధికంగా ఒంగోలులో 42, కందుకూరులో 35 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 54 మంది మృతి చెందారు.