కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

| Edited By:

May 01, 2020 | 10:27 AM

వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో చాలా మంది వ్యవసాయ పనులు చేస్తున్నారు. దీంతో జబర్దస్త్ కమెడియన్..

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్
Follow us on

దేశ వ్యాప్తంగా అందరూ కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అత్యవసర సేవలకు తప్ప మిగతావన్నీ లాక్‌డౌన్‌ పరిధిలో ఉన్నాయి. ఇందులో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో చాలా మంది వ్యవసాయ పనులు చేస్తున్నారు. దీంతో జబర్దస్త్ కమెడియన్ జీవన్ రైతు అవతారం ఎత్తాడు. ఇప్పుడు తనకు సంబంధించిన భూముల్లో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వరి పంట కోతల తర్వాత వడ్లను తూర్పారపడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషలో మీడియాలో చక్కెర్లు కొడుతోంది. జబర్దస్త్‌‌లో చమ్మక్‌ చంద్ర, కిరాక్ ఆర్పీ టీంలలో కమెడియన్‌గానే కాకుండా పలు టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా ముందు జీవన్‌ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరక బలంగా ఉంది. ఏనాటికనా సంగీత డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Read More: 

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు