Corona Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 887 కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందినట్లు గురువారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 

Corona Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!
Corona Positive

Updated on: Apr 01, 2021 | 6:48 PM

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 887 కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందినట్లు గురువారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.  రాష్ట్రంలో కొత్తగా 887 కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందినట్లు గురువారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,08,776 కరోనా కేసులు ఉండగా.. కరోనా వైరస్‎తో 1,701 మరణించారు. ప్రస్తుత్తం రాష్ట్రంలో 5,511 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కోవిడ్ నుంచి ఇప్పటి వరకు 3.01 లక్షల మంది కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ 201, మేడ్చల్‌ 79, నిర్మల్ 78, రంగారెడ్డి 76, జగిత్యాల 56, నిజామాబాద్‌ 45, సంగారెడ్డిలో 36 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.