
అనంతపురం జిల్లాలో కోడి పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. కోడి పందేలు జరుగుతున్నాయన్న సమచారంతో దాడులు చేయడానికి వెళ్లిన పోలీసులపై కోడి కత్తితో దాడి చేశారు పందెం రాయుళ్లు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు పోలీస్ సిబ్బంది. ఈ ఘటన కళ్యాణ్ దుర్గం మండలం బట్టువాని పల్లిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి, 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో 11 మంది పందెం రాయుళ్లు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.