
Congress One More Letter To Facebook: ఫేస్‌బుక్ , కాంగ్రెస్‌ల మధ్య వివాదం మరింత ముదిరింది. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌కు మరో ఘాటైన లేఖ రాశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. భారత్‌లో ఫేస్‌బుక్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు వేణుగోపాల్. ఫేస్‌బుక్ ఇండియా, బీజేపీల మధ్య సంబంధాలపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే తాము లేఖ రాశామని , ఆ లేఖపై విచారణ ఎంత వరకు వచ్చిందని వేణుగోపాల్ తాజా లేఖలో జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)
టైమ్ మేగజేన్‌లో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు వేణుగోపాల్. వాట్సాప్‌ను పూర్తిగా బీజేపీ నియంత్రిస్తోందని ఆరోపించారు వేణుగోపాల్. ఫేస్‌బుక్ అనుబంధ సంస్థగా ఉన్న వాట్సాప్‌లో బీజేపీ వాడుకుంటోందని అన్నారు. వాట్సాప్‌లో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను సర్క్యులేట్ చేస్తున్నారని అన్నారు. ఫేస్‌బుక్ ఇండియా లోని టాప్ అధికారులు బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ ఎంతవరకు వచ్చిందని జుకర్‌బర్గ్‌ను లేఖలో ప్రశ్నించారు వేణుగోపాల్. భారత్‌లో సోదరభావాన్ని భంగపర్చే విధంగా ప్రయత్నిస్తున్న ఫేస్‌బుక్ , వాట్సాప్ లాంటి విదేశీ కంపెనీల తీరును కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు వేణుగోపాల్.