ప్రియాంకా.. వారణాసి నుంచి పోటీ ఛాన్స్ లేదమ్మా
ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఎక్కడినుంచి పోటీ చేస్తున్నారన్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రధాని నరేంద్రమోదీ బరిలోకి దిగిన వారణాసి నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన సోదరుడు రాహుల్ ఆదేశిస్తూ ఈ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రియాంక కూడా ప్రకటించారు. అయితే ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెడుతూ.. తమ పార్టీ తరఫున అజయ్ రాయ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 2014 ఎన్నికల్లో […]

ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఎక్కడినుంచి పోటీ చేస్తున్నారన్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రధాని నరేంద్రమోదీ బరిలోకి దిగిన వారణాసి నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన సోదరుడు రాహుల్ ఆదేశిస్తూ ఈ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రియాంక కూడా ప్రకటించారు. అయితే ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెడుతూ.. తమ పార్టీ తరఫున అజయ్ రాయ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి మోదీపై పోటీ చేసిన అజయ్ రాయ్ అప్పుడు ఓడిపోయినా.. ఇప్పుడు ఆయనకే మరోసారి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వడం విశేషం.
