Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన.. వంటిమామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీల పరిశీలన..

CM KCR Siddept Tour: సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ శివారుల్లో ఉన్న వంటి మామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీలను సీఎం సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో...

CM KCR: సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన.. వంటిమామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీల పరిశీలన..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2021 | 9:40 PM

CM KCR Siddept Tour: సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ శివారుల్లో ఉన్న వంటి మామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీలను సీఎం సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో కేసీఆర్ పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులతో పలు అంశాలపై మాట్లాడిన కేసీఆర్.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే మంచి ధర వస్తుందని సూచించారు. సాగు మెళకువలు తెలుసుకొని శాస్త్రీయ విధానంలో పంటల సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. ఇక కూరగాయల రైతుల నుంచి ఏజెంట్లు 4శాతం కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని, ఆ దిశగా మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు.. కూరగాయలు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. కోల్డ్ స్టోరేజీ నిర్మాణంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు అనువుగా ఉండేలా 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు వంటిమామిడి మార్కెట్‌ నుంచే కూరగాయలు సరఫరా చేయాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.

Also Read: తెలంగాణ పసుపు రైతులకు గుడ్ న్యూస్.. పలు కీలక రాయితీలను ప్రకటించిన స్పైసెస్ బోర్డు