AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలించిన ఆర్టీసీ కార్మికుల కల.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.!

టీఎస్ఆర్టీసీ చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని విలువైన ఆస్తులను ఆర్టీసీ ఇప్పటికే వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన తరువాత, హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో యాజమాన్యం […]

ఫలించిన ఆర్టీసీ కార్మికుల కల.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.!
Ravi Kiran
|

Updated on: Nov 28, 2019 | 9:30 PM

Share

టీఎస్ఆర్టీసీ చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని విలువైన ఆస్తులను ఆర్టీసీ ఇప్పటికే వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన తరువాత, హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో యాజమాన్యం ఆస్తులపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసీ అంశంపై లైవ్‌లో మాట్లాడుతున్నారు..

తమ ప్రభుత్వం ఎవరి పొట్టలు కొట్టలేదని.. దేశం మొత్తంలో చూసుకుంటే.. తెలంగాణాలో మాత్రమే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలిట రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు ఆర్టీసీని విలీనం చేయలేదన్నారు. ఆర్టీసీ సమ్మె, దాని పరిణామాలకు యూనియన్లదే పూర్తి బాధ్యతని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ముందు నుంచీ విధుల్లో చేరమని చెప్పినా.. ఎవరూ వినలేదన్నారు. యూనియన్లు లేనిపోని ఆశలు కల్పించి కార్మికులను బలిపశువులు చేశారని అన్నారు. యూనియన్ల కారణంగా ప్రాణాల కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలని ఆదుకుంటామని.. కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు.

ఇకపోతే దీక్ష దివాస్ గిఫ్ట్‌గా రేపు ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లోకి చేరవచ్చని కేసీఆర్ శుభవార్త అందించారు. దీని ప్రకారం ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీ చార్జీలను పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. కి.మీకు 20 పైసలు చొప్పున పెరగనున్నట్లు ఆయన వెల్లడించారు. అటు ఆర్టీసీకి వెంటనే 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.