వాటర్ వార్‌పై డైలాగ్ వార్.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

వాటర్ వార్‌పై డైలాగ్ వార్.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

ఈ జలవివాధంపై తమ వాదనను అపెక్స్ కమిటీ ముందు బలంగా వనిపిస్తామని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

Sanjay Kasula

|

Aug 10, 2020 | 8:41 PM

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్‌పై డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . తెలంగాణ ప్రాజెక్టులపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్‌ టాపిక్ మారింది.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ నిరాధార అరోపణలు చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రం కూడా తప్పుడు విధానాలు అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడానని.. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని చెప్పానన్న సీఎం కేసీఆర్. ఏపీ ప్రభుత్వం కావాలని కయ్యమే పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ జలవివాధంపై తమ వాదనను అపెక్స్ కమిటీ ముందు బలంగా వనిపిస్తామని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu