1970ల నాటి బోల్డ్‌ వెబ్ సిరీస్‌లో అమ‌లా పాల్!

1970ల నాటి బోల్డ్‌ వెబ్ సిరీస్‌లో అమ‌లా పాల్!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఓటీటీల‌కు, వెబ్ సిరీస్‌ల‌కు మంచి డిమాండ్ పెరిగిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌ న‌టీ న‌టులు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో అడుగు పెడుతున్నారు. ఇక కోవిడ్ వ్యాప్తి కార‌ణంగా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 8:34 PM

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఓటీటీల‌కు, వెబ్ సిరీస్‌ల‌కు మంచి డిమాండ్ పెరిగిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌ న‌టీ న‌టులు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో అడుగు పెడుతున్నారు. ఇక కోవిడ్ వ్యాప్తి కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా థియేట‌ర్స్ కూడా ఎక్క‌డా ఓపెన్ కావ‌టం లేదు. దీంతో అంద‌రూ మొబైల్ ఫోన్ల‌కే అతుక్కుపోయారు. ఇక నటీ న‌టులు కూడా త‌మ పంథా మార్చుకుంటున్నారు. ఇప్ప‌టికే స‌మంత ఫ్యామిలీ మ్యాన్‌-2లో చేయ‌గా, త‌మ‌న్నా, నిత్య మేన‌న్, సాయి ప‌ల్ల‌వి, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆ ప్రయ‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు అమ‌లా పాల్ కూడా అదే దారిలో ప్ర‌యానించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

1970ల నాటి స్టోరీతో తెలుగు- త‌మిళంలో ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తున్నారు. అప్ప‌టి ప‌రిస్థితుల్ని తెలిపే న‌వ‌ల ఆధారంగా ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌‌ను రూపొందిస్తున్నార‌ట‌. ఇందులో అమ‌లా పాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే ఈ సిరీస్ రెండోది కావ‌డం గ‌మ‌నార్హం. హిందీలో మ‌హేష్ భ‌ట్‌, జియో స్టూడియోస్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి అమ‌లా పాల్ ఇటీవ‌ల ఒకే చెప్పిన విష‌యం తెలిసిందే. దీని ద్వారా బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంది అమ‌లా పాల్.

Read More: 

ఆగ‌ష్టు 15 వేడుక‌లపై తెలంగాణ హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా కంపెనీ గుడ్‌ బై

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu