ఏపీలో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే..సర్వేరాయి పాతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

|

Dec 21, 2020 | 12:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం' పేరుతో భూముల రీ సర్వేను ప్రారంభించింది ప్రభుత్వం.

ఏపీలో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే..సర్వేరాయి పాతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరుతో భూముల రీ సర్వేను ప్రారంభించింది ప్రభుత్వం. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.   భూముల రీసర్వే వివరాలు, సర్వే కోసం వినియోగించే పరికరాలను, సర్వే ద్వారా కలిగే ఫలితాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని మూడుదశల్లో చేపట్టి 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని ఏపీ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది.  ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించనున్నారు. అనంతరం రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరచనున్నారు. రాష్ట్రంలో 1920-27 మధ్యలో భూముల సర్వే జరిగింది. వందేళ్ల తర్వాత మళ్లీ భూముల సమగ్ర సర్వేకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. తక్కెళ్లపాడులో జరిపిన రీ-సర్వే మ్యాప్​ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

Also Read :

కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం

ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి